నేత్రదానం చేసి ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపిన పాలాది హైందవి
జడ్చర్లలో కుటుంబ సభ్యుల ఆదర్శ నిర్ణయం
జడ్చర్ల, సెప్టెంబర్ 25:
నేత్రదానం ద్వారా మరణానంతరం కూడా ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపవచ్చనే సందేశాన్ని పాలాది హైందవి కుటుంబ సభ్యులు చాటిచెప్పారు. జడ్చర్లకు చెందిన పాలాది హైందవి ఆకస్మికంగా మృతి చెందగా, ఆమె మరణానంతరం నేత్రదానం చేయాలని తల్లిదండ్రులు పాలాది సారిక–రామ్మోహన్ నిర్ణయించారు.
బాధలో ఉన్నప్పటికీ తమ కుమార్తె నేత్రాలను దానం చేసి, మరో ఇద్దరికి చూపును ప్రసాదించాలనే కుటుంబ సభ్యుల నిర్ణయం పలువురికి ఆదర్శంగా నిలిచింది. ఈ విషయాన్ని మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ పాలాది రామ్మోహన్, కుటుంబ సభ్యులు, Ln శరత్ చంద్ర, వాసు తదితరులు రెడ్‌క్రాస్ సంస్థకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న వెంటనే రెడ్‌క్రాస్ చైర్మన్ Ln అంబటి నటరాజ్ మరియు LV ప్రసాద్ కంటి ఆసుపత్రి టెక్నీషియన్ శివ స్పందించారు. శుక్రవారం 25-09-2026 ఉదయం 10 గంటలకు హైందవి నేత్రాల నుంచి కార్నియాలను సేకరించి, అనంతరం కుటుంబ సభ్యులకు ధృవీకరణ పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా Ln అంబటి నటరాజ్ మాట్లాడుతూ, “నేత్రదానం ఒక మహాదానం. ఒక వ్యక్తి మరణించిన తర్వాత కూడా మరో ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపే అవకాశం నేత్రదానం ద్వారా లభిస్తుంది. ప్రజలు అపోహలను వీడి నేత్రదానానికి ముందుకు రావాలి” అని పిలుపునిచ్చారు.
ఇప్పటివరకు జడ్చర్ల ప్రాంతంలో 276 మంది తమ కార్నియాలను దానం చేయగా, వాటి ద్వారా 552 మందికి చూపు కల్పించే అవకాశం లభించిందని ఆయన తెలిపారు. నేత్రదానంపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించేందుకు రెడ్‌క్రాస్, లయన్స్ క్లబ్‌ల ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
హైందవి కుటుంబ సభ్యులు చూపిన మానవతా దృక్పథాన్ని లయన్స్ క్లబ్ ఆఫ్ జడ్చర్ల, లయన్స్ క్లబ్ ఆఫ్ పాలమూరు తరఫున Ln అంబటి నటరాజ్ అభినందించారు. ఆప్తురాలిని కోల్పోయిన తీవ్ర విషాద సమయంలోనూ నేత్రదానానికి అంగీకరించి, మరో ఇద్దరికి వెలుగునిచ్చే నిర్ణయం తీసుకున్న కుటుంబ సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
“మనం ఈ లోకాన్ని విడిచిపోయిన తర్వాత కూడా మన కళ్ల ద్వారా మరొకరు ప్రపంచాన్ని చూడగలిగితే అంతకంటే గొప్ప మానవతా సేవ మరొకటి లేదు” అని ఆయన పేర్కొన్నారు.
నేత్రదానం చేయాలనుకునే వారు రెడ్‌క్రాస్ చైర్మన్ Ln అంబటి నటరాజ్ – 9666900900 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.
నేత్రదానం చేయండి…
మరణానంతరం కూడా ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపండి.
Telangana
నేత్రదానం చేసి ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపిన పాలాది హైందవి
Quick Summary:
నేత్రదానం చేసి ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపిన పాలాది హైందవి
