సాయి అనుశ్రీ నగర్‌లో గణపతి లడ్డూ వేలం.. దక్కించుకున్న డా. లక్ష్మి వీరమల్లు
బోడుప్పల్/నవోదయం :
హైదరాబాద్ బోడుప్పల్‌లోని సాయి అనుశ్రీ నగర్‌లో గణపతి నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా ముగిశాయి. పార్క్ వద్ద ఏర్పాటు చేసిన వినాయక మండపంలో తొమ్మిది రోజుల పాటు ప్రత్యేక పూజలు, కుంకుమార్చనలు, భక్తి కార్యక్రమాలు నిర్వహించారు. ఉత్సవాల ముగింపు సందర్భంగా నిర్వహించిన గణపతి లడ్డూ వేలంపాటలో కాలనీ వ్యవస్థాపక అధ్యక్షులు, చెరువు పరిరక్షణ సమితి సభ్యులు, సామాజిక కార్యకర్త డా. లక్ష్మి వీరమల్లు కుటుంబ సభ్యులతో కలిసి లడ్డూను దక్కించుకున్నారు.
ఈ సందర్భంగా డా. లక్ష్మి వీరమల్లు మాట్లాడుతూ.. సుమారు పది సంవత్సరాలుగా సాయి అనుశ్రీ నగర్‌లో గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించి భక్తిశ్రద్ధలతో నవరాత్రి ఉత్సవాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతి ఏడాది కాలనీ ప్రజలు, కమిటీ సభ్యులు, మహిళలు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సవాలను విజయవంతం చేస్తున్నారని పేర్కొన్నారు.
ఈ ఏడాది కూడా ప్రత్యేక పూజలు, కుంకుమార్చనలు, మహా అన్నప్రసాద వితరణతో పాటు భక్తి కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. మహిళలు, చిన్నారులు, యువత ఉత్సాహంగా పాల్గొని పాటలు, ఆటలతో ఉత్సవ వాతావరణాన్ని మరింత సందడిగా మార్చారని చెప్పారు.
వినాయకుని ఆశీస్సులతో కాలనీలో సుఖసంతోషాలు, ఆరోగ్యం, ఐకమత్యం నెలకొనాలని కోరుకుంటున్నామని డా. లక్ష్మి వీరమల్లు తెలిపారు. ఉత్సవాల నిర్వహణలో సహకరించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.
గణపతి నిమజ్జనం కార్యక్రమాన్ని కూడా భక్తుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. కాలనీ కుటుంబాలు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తిశ్రద్ధలతో గణనాథుడికి వీడ్కోలు పలికారు. నిమజ్జనం కార్యక్రమం ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా విజయవంతంగా ముగిసింది.
ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ రెడ్డి, బాపురెడ్డి, శేఖర్, వీరబాబు, మల్లికార్జునరావు, మధుకర్, కృష్ణయ్య, మీశ్రా, రాకేష్, యాదగిరి, సత్యనారాయణ, గిరి, నర్సింహరావు, ఋషి, గణేష్, సంతోష్, రమిత్, యాదగిరి, శివనాథ్, శ్రీనివాస్, రాధాకృష్ణ, పురేందర్, సురేష్, సమ్మిరెడ్డి, సుదర్శన్, నవీన్ రెడ్డి, రత్నాకర్ రెడ్డి తదితరులు కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు.
ఉత్సవాల విజయవంతానికి సహకరించిన కాలనీ వాసులు, కమిటీ సభ్యులు, మహిళలు, యువత, చిన్నారులకు డా. లక్ష్మి వీరమల్లు కుటుంబ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్‌లోనూ ఇదే స్ఫూర్తితో కాలనీ అభివృద్ధి, సామాజిక కార్యక్రమాల్లో అందరూ కలిసి ముందుకు సాగాలని వారు ఆకాంక్షించారు.
Telangana
సాయి అనుశ్రీ నగర్‌లో గణపతి లడ్డూ వేలం.. దక్కించుకున్న డా. లక్ష్మి వీరమల్లు
Quick Summary:
సాయి అనుశ్రీ నగర్‌లో గణపతి లడ్డూ వేలం.. దక్కించుకున్న డా. లక్ష్మి వీరమల్లు

