షాద్‌నగర్‌లో గణేశ్ ఉత్సవ చెస్ కార్యక్రమం నిర్వహణ
బాలబాలికల ప్రతిభకు పట్టం..
తొలి చెస్ ఛాంపియన్‌షిప్‌కు వేదికగా మల్లికార్జున కాలనీ
చెస్ ఉత్సవాలలో పాల్గొనాలని ఏసీపీ గారిని ఆహ్వానించిన చెస్ నిర్వాహకుడు వానరసి జగన్
నవోదయం/షాద్ నగర్, సెప్టెంబర్ 25
పండుగ వేళ షాద్ నగర్ పట్టణంలో చదరంగం సందడి మొదలవుతోంది. షాద్‌నగర్ చెస్ అకాడమీ చొరవతో ఈ నెల 27న తొలిసారిగా షాద్‌నగర్ గణేశ్ ఉత్సవ చెస్ ఛాంపియన్‌షిప్–2026 ఘనంగా జరగనుంది.మల్లికార్జున కాలనీలోని పతంజలి యోగా మందిర్ హాల్ వేదికగా ఆదివారం ఉదయం 9 గంటలకు పోటీల శంఖారావం మోగనుంది. పిల్లల్లో దాగున్న చదరంగ ప్రతిభను వెలికితీసి, వారిని ప్రోత్సహించడమే ఈ పోటీల ముఖ్య ఉద్దేశమని నిర్వాహకులు స్పష్టం చేశారు.ఈ సందర్బంగా షాద్ నగర్ ఏసీపీ లక్ష్మి నారాయణ గారిని కలిసి చెస్ ఉత్సవాల్లో పాల్గొనాలని ఆహ్వానించిన చెస్ టోర్నమెంట్ నిర్వాహకుడు వానరసి జగన్. సానుకూలంగా స్పందించిన ఏసీపీ గారు. ఈ పోటీల్లో అండర్–8 నుంచి అండర్–16 వరకు ఐదు విభాగాల్లో బాలబాలికలు తలపడనున్నారు. ఉదయం 8.30కే ఆటగాళ్లు రిపోర్టింగ్ చేయాల్సి ఉండగా, 9 గంటలకు లాంఛనంగా ప్రారంభోత్సవం, క్రీడాకారుల సమావేశం జరుగుతుంది. అనంతరం సాయంత్రం 5 గంటల వరకు 25 ప్లస్ 10 సెకన్ల ఇన్‌క్రిమెంట్ టైమ్ కంట్రోల్‌తో మ్యాచ్‌లు హోరాహోరీగా సాగనున్నాయి.ఈ నెల 26న సాయంత్రం 4 గంటలలోపు నమోదు పూర్తి చేసుకోవాలని చెస్ మాస్టర్ వానరాశి జగన్ తెలిపారు . విజేతలకు మెమెంటోలు, పతకాలు, ప్రశంసాపత్రాలు దక్కనుండగా, పాల్గొన్న ప్రతి ఒక్కరికీ సర్టిఫికెట్ అందించనున్నారని స్పష్టం చేశారు. ఆటగాళ్లకు ఉచిత భోజన ఏర్పాట్లు కూడా చేశారు. సాయంత్రం 5 గంటల నుంచి బహుమతుల ప్రదానోత్సవంతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని నిర్వాహకుడు ఎం.వి. జగన్ తెలిపారు. మరిన్ని వివరాల కోసం 93468 43126 సంపాదించాలని కోరారు.
Sports
షాద్‌నగర్‌లో గణేశ్ ఉత్సవ చెస్ కార్యక్రమం నిర్వహణ
Quick Summary:
షాద్‌నగర్‌లో గణేశ్ ఉత్సవ చెస్ కార్యక్రమం నిర్వహణ
