తలకొండపల్లిలో ఉచిత హెల్మెట్ల పంపిణీ
రోడ్డు భద్రతపై అవగాహన కల్పించడమే లక్ష్యం : దోర్నాల వెంకటేశ్వర్ రెడ్డి
తలకొండపల్లి: రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన పెంపొందించడంతో పాటు ద్విచక్ర వాహన ప్రమాదాలను నివారించి ప్రాణాలను కాపాడాలనే ఉద్దేశంతో తలకొండపల్లి మండల కేంద్రానికి చెందిన సంఘసంస్కర్త, దాత దోర్నాల వెంకటేశ్వర్ రెడ్డి తన 62వ జన్మదినం సందర్భంగా వినూత్న కార్యక్రమం చేపట్టారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ద్విచక్ర వాహనదారులకు ఉచితంగా 100 హెల్మెట్లను పంపిణీ చేశారు.
CI జానకిరాం రెడ్డి, SI శ్రీకాంత్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ద్విచక్ర వాహనదారులతో పాటు మండలంలోని పత్రికా మిత్రులకు కూడా హెల్మెట్లను అందజేశారు.
ఈ సందర్భంగా దోర్నాల వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ప్రయాణించాలని, ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని సూచించారు. రోడ్డు ప్రమాదాలు జరిగిన సమయంలో హెల్మెట్ ప్రాణాలను కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ప్రజల్లో రోడ్డు భద్రతపై మరింత అవగాహన పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలను భవిష్యత్‌లోనూ కొనసాగిస్తామని పేర్కొన్నారు.
ఉచితంగా హెల్మెట్లు అందుకున్న ద్విచక్ర వాహనదారులు దోర్నాల వెంకటేశ్వర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో చుక్కాపూర్ సర్పంచ్ వీరేష్, బీజేపీ నాయకులు, మాజీ సర్పంచ్ బక్కి కుమార్, రవి గౌడ్, నీలకంఠ పాండు, మాజీ ఎంపీటీసీ పెరుమాళ్ల రాజు, మాజీ ఉపసర్పంచ్ పద్మ అనిల్ ముదిరాజ్, రొయ్యల యాదయ్య, శేఖర్ రెడ్డి, పద్మ వెంకటేష్, ఆరిఫ్, శ్రీశైలం యాదవ్, బొల్లా శ్రీను, పుల్లరెడ్డి శ్రీశైలం, పుట్ట నాగారాజు, బాలకృష్ణ, శ్రీను, కుమార్, ఎస్. సాయిలు, రాము, శివతో పాటు గ్రామ ప్రజలు, యువకులు పాల్గొన్నారు.
Telangana
తలకొండపల్లిలో ఉచిత హెల్మెట్ల పంపిణీ రోడ్డు భద్రతపై అవగాహన కల్పించడమే లక్ష్యం : దోర్నాల వెంకటేశ్వర్ రెడ్డి
Quick Summary:
తలకొండపల్లిలో ఉచిత హెల్మెట్ల పంపిణీ రోడ్డు భద్రతపై అవగాహన కల్పించడమే లక్ష్యం : దోర్నాల వెంకటేశ్వర్ రెడ్డి



