"మీడియా రంగంలో బీసీ / ఎస్సీ / ఎస్టీ కుల ప్రాతినిద్యము ఉండాల్సిందే ..!!
జర్నలిస్టు మిత్రులారా ఆలోచించండి
: డాక్టర్ బండి విజయకుమార్, జర్నలిస్ట్
ప్రజాస్వామ్యం లో ప్రజాభిప్రాయాన్ని నిర్మించే కీలక వ్యవస్థ మీడియా. ప్రశ్నించడం, పరిశీలించడం, ప్రజలకు సమాచారం అందించడం, ప్రభుత్వాలను జవాబు దారిగా ఉంచడం మీడియా ఫోర్త్ ఎస్టేట్ లో భాగం. ఆర్టికల్ 19 లోని భావప్రకటన స్వేచ్ఛ, మీడియా రూపం లో ఉంది.
మన మహనీయులు, మారాఠా చక్రవర్తి శివాజి మహరాజ్ వారసుడు బరోడా మహారాజు (కొల్హాపూర్ సంస్థానం) షాహు మహరాజ్ తను 1918 లో ఆనాటి బ్రిటీష్ మాజీ గవర్నర్ లార్డ్ సిడెన్ హమ్ కు లేఖరాస్తూ - ఆనాటి ప్రోవిన్షియల్ కౌన్సిల్, ఇంపీరియల్ కౌన్సిల్లో " కమ్యూనల్ ప్రజెంటేషన్" ( కుల ప్రాతినిధ్యం) ఉండాలని కోరటం జరిగింది. అందులో భాగంగానే మహత్మ జ్యోతి భా పూలే కూడా ' కుల ప్రాతినిధ్యం' ఉండాలని కోరుకున్నాడు .
బరోడా మహరాజు ఆర్థిక సహకారంతో డా॥ బాబాసాహెబ్ అంబేద్కర్ అమెరికా, లండన్ వెళ్లి చదువు కుని, భారత రాజ్యాంగంలో 'కుల ప్రాతినిధ్యం' కింద చట్టసబల్లో, విద్య, ఉద్యోగాల్లో ప్రాతినిధ్యం ఉండాలని 'ఆర్టికల్ 16 (4) (కారం రాజ్యాంగం లో పొందు పరిచారు. (వెనుక బడిన వర్గాలకు రిజర్వేషన్ )
అయితే ఆర్టికల్ 15 ప్రకారం : ఎస్సీ, ఎస్టీ వ ర్గాల అభివృద్ధికోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని రాజ్యాంగం అనుమతించింది.ప్రయివేటు రంగంలో దేశ మీడియా !
దేశంలో, రాష్ట్రంలో మీడియారంగం పూర్తిగా, ప్రయివేటు రంగంతో పాటు అగ్రకులాల ఆదినంలో ఉంది. " ప్రజల గొంతుకను ప్రతిబించించే మీడియా సంస్థల్లో సామాజిక వైవిధ్యం ఉండాలి". అంటే అన్ని వర్షాల ప్రాతినిధ్యం ఉన్నప్పుడే రాజ్యాంగా లక్ష్యం నెరవేరుతుంది.
దేశంలో 2019లో 50 ప్రధాన మీడియా సంస్థల్లో "oxfan-Newslaundry' అనే సంస్థ అధ్యయనం చేసింది. 121 న్యూస్ రూమ్ లీడర్ షిప్ లో - 106 మంది అగ్రకులాల వారే ఉన్నారు.
అలాగే TV న్యూస్ -ఫ్లాగ్ షిప్ డిబేట్ లలో 75%, అగ్రకులాల జర్నలిస్టులే. డిజిటల్ మీడియా లీడర్షిప్లో కూడా కూడా 84 శాతం అగ్రకులాల జర్నలిస్టులే.
2022 లో కూడా " "OxFan-News laundry" సంస్థ మళ్ళీ సర్వే చేసింది. 218 సంస్థలలో, 191 మంది " అగ్రకుల జర్నలిస్టులే ఉన్నారు. కేవలం 5మంది ఓబీసీ వారు, 6 గురు మైనార్టీలు మాత్రమే ఉన్నారు.
అయితే కేంద్ర ప్రభుత్వం 2006 లో SC/ST వర్గాలకు ప్రయివేట్ రంగంలో అవకాశాలు కల్పించటానికి "అపిరిమేటివ్ యాక్షన్- 2006" పేరిట కార్యాచ రణ తీసుకుంటే - ప్రయివేటు రంగం వారు అందుకు ఒప్పుకోకుండా కేవలం మెరిట్, అనుభవం, నైపుణ్యం, సంస్థ అవసరాలు వంటి ప్రమాణాలతో " వాలంటరీ అఫిరమేటివ్ యాక్షన్'ను ముందుకు తీసుకువచ్చారు.ఆర్టికల్ 14 ప్రకారం "చట్టం ముందు అందరూ సమానులే " అని రాజ్యాంగం చెబుతుంది. అయితే పత్రికలు, టీవి చా నళ్ళు, డిజిటల్ మీడియా సంస్థలు పూర్తిగా ప్రయివేటు సంస్థల చేతుల్లో ఉండడంతో అవి పూర్తిగా 'సమాన అవకాశాలకు వి రుద్ధంగా, అగ్రకుల జర్నలిస్టులతో నిండిపోయాయి.
ఫలితంగా పత్రికలు, తీవి చానళ్ళు, డిజిటల్ మీడియాలో వస్తున్న వార్తలు కేవలం కొన్ని వర్గాల అభిప్రాయాలనే జాతీయ అభిప్రాయాలుగా ప్రజల నెత్తిన రుద్దుతున్నారు.
ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల అభిప్రాయాలు, సంస్కృతి, చైతన్యానికి సంబంధించిన వార్తలు, కథనాలు, ప్రచురణ, లేక దృష్యం చూపించటం తక్కువే.
మీడియాలో ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ జర్నలిస్ట్ లకు అవకాశం ఇవ్వకపోతే సామాజిక వైవిద్యం-ఎలా సాధ్యమవుతుంది.
మీడియా చట్టభద్ద సంస్థల్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ నామినెట్ ఎక్కడ ?
కేంద్ర ప్రభుత్వం 1978 లో ప్రెస్ కౌన్సిల్ యాక్ట్ ద్వారా చట్టభద్ద మైన 'ప్రెస్ కౌన్సిల్ అఫ్ ఇండియా' ను స్థాపించింది. నిబంధనలు సెక్షన్ 5 ప్రకారం ప్రెస్ కౌన్సిల్ నిర్మాణం రూపొందించారు. కాని ఎస్సీ / ఎస్టీ / ఓబీసీ లను నామినేటెడ్ చేసి సభ్యులు గా పంపవచ్చు. కాని ప్రెస్ కౌన్సిల్ నిబంధనలు ఒప్పుకోవు. పార్లమెంట్ లో చట్ట సవరణ చేసి, కేంద్ర ప్రభుత్వం ఆయా వర్గాలకు ప్రాతినిత్యం కల్పించవచ్చు. అలాగే రాష్ట్రాలా పరిధిలో ఉండే సలహా కమిటీ లకు / గవర్నింగ్ కౌన్సిల్ లకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ / ఎస్టీ / ఓబీసీ సభ్యులను నామినెట్ చేయవచ్చు. కాని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా తెలంగాణ స్టేట్ మీడియా అక్క్రిడిటేషన్ రూల్స్ - 2005 లో కూడా ఎస్సీ / ఎస్టీ / ఓబీసీ ల విజ్ఞప్తి ని పరిగణలోకి తీసుకోలేదు. కాని కొన్ని నియమాలు మార్చి మహిళ లకు / ఉర్దూ జర్నలిస్ట్ లకు / డెస్క్ జర్నలిస్ట్ లకు చోటు కల్పించారు.అలాగే తెలంగాణ మీడియా అకాడమీ, ప్రెస్ క్లబ్ లు రాజ్యాంగం పద్ధతుల్లో ఎస్సీ / ఎస్టీ / ఓబీసీ జర్నలిస్ట్ లకు ప్రాతినిత్యం కల్పించాలి.
జర్నలిస్ట్ యూనియన్ లలో కూడా ప్రాతినిత్యం ఎస్సీ/ఎస్టీ లకు తక్కువే :
జాతీయ స్థాయిలో జర్నలిస్ట్ లకు ప్రాతినిత్యం వహిస్తున్న జర్నలిస్ట్ సంఘాలకు ఉత్తరాది ఆధిపథ్యం తో పాటు అగ్రకుల నాయకత్వం లోనే నడుస్తున్నాయి. ఇక తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన కొన్ని జర్నలిస్ట్ సంఘాలు ఓసీ లతో పాటు బీసీ లు నాయకత్వం వహిస్తున్నారు. కాని ఎస్సీ / ఎస్టీ జర్నలిస్ట్ లకు అవకాశం దక్కకుండా జాగ్రత్త పడుతున్నారు. భారత రాజ్యాంగం అమలు లోకి వచ్చినా, ఇంకా మీడియా మనుధర్మ వారసుల గుప్పిట్లోనే ఉంది. దీనిని విముక్తి చేయాల్సిన బాధ్యత ఫూలే / అంబేద్కర్ ఆశయం పేరుతో కొనసాగే జర్నలిస్ట్ సంఘాల మీద ఉంది.ఆర్టికల్ 16(4) ప్రకారం రాష్ట్ర సేవల్లో తగినంతగా ప్రాతినిత్యం లేని వెనుకబడిన తరగతుల కోసం నియామకాలు లేదా పోస్ట్ లల్లో రిజర్వేషన్స్ కల్పించటానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవచ్చు అని స్పష్టంగా చెబుతోంది.
జర్నలిస్ట్ బండి విజయ్ కుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షులు, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్. (TWJF )
Telangana
"మీడియా రంగంలో బీసీ / ఎస్సీ / ఎస్టీ కుల ప్రాతినిద్యము ఉండాల్సిందే ..!!
Quick Summary:
"మీడియా రంగంలో బీసీ / ఎస్సీ / ఎస్టీ కుల ప్రాతినిద్యము ఉండాల్సిందే ..!!