ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం
మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్
మేడ్చల్ మల్కాజ్గిరి /నవోదయం
షాపూర్‌నగర్‌లోని మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్‌ను నియోజకవర్గానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, సంక్షేమ సంఘాల సభ్యులు, కార్యకర్తలు బుధవారం ఆయన నివాస కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించనున్న పూజా కార్యక్రమాలు, నిమజ్జన కార్యక్రమాలకు హాజరు కావాల్సిందిగా ఆయనను ఆహ్వానించారు. అలాగే నియోజకవర్గంలోని పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చి, వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టాలని కోరుతూ వినతిపత్రాలు సమర్పించారు.ఈ సందర్భంగా కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారం, అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. ప్రజలకు పారదర్శకమైన, సమర్థవంతమైన పరిపాలన అందించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రజల నుంచి వచ్చే సమస్యలు, వినతులను ప్రాధాన్యతతో పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
Telangana
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్
Quick Summary:
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్
