నియోజకవర్గ పరిధిలో పలు గణనాథులను దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్
మేడ్చల్ మల్కాజ్గిరి /నవోదయం :
కుత్బుల్లాపూర్ మాజీ శాసనసభ్యులు కూన శ్రీశైలం గౌడ్ బుధవారం సూరారం డివిజన్‌లోని లక్ష్మీనగర్, చింతల్ సర్కిల్ పరిధిలోని 283 గిరినగర్ డివిజన్‌లో ఉన్న ఇందిరాగాంధీ నగర్ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన గణేష్ మండపాలను సందర్శించి, గణనాథులను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా వివిధ గణేష్ మండపాల కమిటీ సభ్యులు కూన శ్రీశైలం గౌడ్‌ను శాలువాతో ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు చౌడ శ్రీనివాస్, కూన రాఘవేందర్ గౌడ్, మోటే శ్రీనివాస్ యాదవ్, ఆర్వ వెంకట్, షాకీర్, శంకర్ గౌడ్, గణేష్ మండపాల కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Telangana
నియోజకవర్గ పరిధిలో పలు గణనాథులను దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్
Quick Summary:
నియోజకవర్గ పరిధిలో పలు గణనాథులను దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్