పాలిటెక్నిక్ విద్యా భవిష్యత్తు ఏమిటి
సాంకేతిక విద్యాను నిర్వీర్యం చేస్తున్న ప్రభుత్వం
యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో విలీనం చేయాలని ఆలోచనను మానుకోవాలి
పాలిటెక్నిక్ విద్య వ్యవస్థను నిర్వీర్యం చేసే జీవో నెంబర్ 97ను రద్దు చేస శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి
ఏఐఎస్ఎఫ్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఎం పవన్ చౌహన్
నవోదయం/షాద్ నగర్, ఆగస్టు 19
షాద్ నగర్ నియోజకవర్గ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలను శక్తి శాఖలో వీలినం చేయాలన్న ప్రభుత్వ ఆలోచనను తక్షణమే విరమించుకోవాలని, పాలిటెక్నిక్ విద్యావ్యవస్థను నిర్వీర్యం చేసే జీవో నెంబర్ 97ను రద్దు చేయాలని *ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి సభ్యుడు ఆకాష్ నాయక్ ఆధ్వర్యంలో* ఈరోజు షాద్నగర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులతో జీవో నెంబర్ 97ను రద్దు చేసే భవిష్యత్తు కార్యాచరణ గురించి చర్చించడం జరిగింది ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఏఐఎస్ఎఫ్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఎం పవన్ చౌహన్ మాట్లాడుతూ
పాలిటెక్నిక్ విద్య అనేది పరిశ్రమలకు అవసరమైన సాంకేతిక నైపుణ్యం కలిగిన మానవ వనరులను అందించే ఒక ప్రత్యేక వ్యవస్థ అని పేర్కొన్నారు దీనిని శక్తి శాఖలో కలపటం వలన విద్య వ్యవస్థ తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఉందని ప్రభుత్వ కళాశాలలు ప్రైవేట్ పరం అయితే పేద మధ్యతరగతి విద్యార్థులకు తక్కువ ఖర్చుతో కూడిన డిప్లోమా విద్య అందకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు పేద విద్యార్థులకు నాణ్యమైన సాంకేతిక విద్య ప్రభుత్వాలు అందుబాటులో ఉంచాలి కాని రాష్ట్ర ప్రభుత్వం పేద విద్యార్థులను విద్యకు దూరం చేసే కుట్ర పన్నుతుందని విమర్శించారు
పాలిటెక్నిక్ కళాశాలను సాంకేతిక విద్యాశాఖ పరిధిలోనే కొనసాగించాలని
రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నెంబర్ 97 ను రద్దు చేయాలని రాష్ట్రంలో సాంకేతిక విద్యా మండలిని విశ్వవిద్యాలయంగా అప్గ్రేడ్ చేస్తామని గతంలో ప్రభుత్వం ప్రకటించడంతో అందుకు మంత్రివర్గం ఉప సంఘం పచ్చ జెండా ఊపింది కానీ ఆ తర్వాత కొత్తగా యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేశారని ఐటీ పరిశ్రమలు శాఖ పరిధిలో నడుస్తున్న ఈ యూనివర్సిటీని సాంకేతిక విద్యా శాఖ పరిధిలోకి తెస్తామని ప్రభుత్వం చెప్పినప్పటికీ ఆ దిశగా ముందడుగు వేయలేదని తాజాగా ఐటిఐలు ఏటీసీలు పాలిటెక్నిక్ కళాశాల ను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో చేర్చాలని సర్కార్ ఆలోచన విధానం సరికాదని దీంతో ప్రభుత్వం సాంకేతిక విద్యాశాఖతో ఆటలాడుతు ఉంటే అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం చూస్తూ ఊరుకోనేదే లేదని నిర్ణయాలను వెనుక తీసుకోవాలని ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన పాలసీ ద్వారా విద్యార్థులు కార్మికులుగా మారే అవకాశం ఉందని, వేలాదిమంది విద్యార్థులు ప్రవేశ పరీక్ష రాసి పాలిటెక్నిక్ కళాశాలలో జాయిన్ అవుతరానికి నేడు ప్రభుత్వం తీసుకువచ్చిన నిర్ణయాన్ని చూసి విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారని, లక్షలాదిమంది విద్యార్థులు ప్రభుత్వ పాలిటెక్నికల్ కళాశాలలో చదువుతున్నారని ప్రభుత్వం వారికి అధిక సదుపాయాలు కల్పించి అధ్యాపకులు భర్తీ, ల్యాబ్ల ఆధునికరణ వర్క్ షాపులు నిర్వహణ హాస్టల్ అభివృద్ధి చేయాలి కానీ ప్రైవేటీకరణ దిశగా ప్రభుత్వం ఆలోచన చేయడం సరికాదని తక్షణమే ఈ ఆలోచనను ఉపసంహరించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి సభ్యుడు ఆకాశ్ నాయక్ షాద్నగర్ ఉపాధ్యక్షుడు సాయి మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
Telangana
పాలిటెక్నిక్ విద్యా భవిష్యత్తు ఏమిటి..? సాంకేతిక విద్యాను నిర్వీర్యం చేస్తున్న ప్రభుత్వం
Quick Summary:
పాలిటెక్నిక్ విద్యా భవిష్యత్తు ఏమిటి..? సాంకేతిక విద్యాను నిర్వీర్యం చేస్తున్న ప్రభుత్వం
